TG: రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో నిఘా మరింత పటిష్టం చేసింది. ఇటీవల సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పెరగడంతో భద్రత పెంచింది. కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. భద్రతా పరమైన బెదిరింపు కాల్స్‌లో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసింది. సీఎం భద్రతా దృష్ట్యా సీఎం వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో నాలుగు దిక్కులు కవర్ చేసేలా 360 డిగ్రీల కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.