ADB: బోథ్ మండలంలోని దన్నూర్ (బి) గ్రామంలో మంజూరు అయిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా సమిష్టిగా పనిచేసి నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో MLC విట్టల్, కలెక్టర్ రాజర్షి షా తదితరులున్నారు.