JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల రద్దీ నెలకొంది. శనివారం ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం స్థానిక దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.