ELR: డ్రోన్ టెక్నాలజీ వినియోగించి అత్యంత తక్కువ సమయంలోనే నేరస్థులను పట్టుకునేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం అవంతి ఫీట్స్ అధినేత ఇంద్ర కుమార్ రూ.8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌ను జిల్లా పోలీసు శాఖకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.