ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్పోర్టు రోడ్డులో నటుడు బాబీ సింహా కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం డ్రైవర్ను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని పోలీసులు వెల్లడించారు.