SRD: అమీన్పూర్లో వీర సైనికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని శనివారం సాయంత్రం పట్టణ ప్రజలు చేపట్టారు. ఐలాపూర్ మణిక్ యాదవ్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్.. జై భారత్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం భారత వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపాలిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.