NTR: తిరువూరు మండలం రోలుపడి శివారులో తిరువూరు నుంచి మధిర వెళ్ళే ప్రధాన రహదారి ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా భారీ గొయ్యి ఏర్పడింది. నడిరోడ్డుపై అడుగు వెడల్పు మూడడుగుల లోతుతో గొయ్యి వలన అమాయక ప్రజలకు ప్రాణ సకటంలా మారకూడదని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.