VZM: మాతృ దినోత్సవం సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన మాతృమూర్తి సూరప్పమ్మకు ఆదివారం పాదాభివందనం చేశారు. లావేరు మండలం మెట్టవలసలో విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో తల్లితో కలిసి మొక్కను నాటారు. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో 29వ రోజు తన తల్లితో కలిసి మొక్కను నాటినట్లు ఎంపీ తెలిపారు. తల్లిని ప్రతి ఒక్కరూ పూజించాలని పిలుపునిచ్చారు.