JGL: ధర్మపురి పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోరుట్ల నియోజకవర్గంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కోరుట్లలో అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.