అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వారంలో చేపట్టనున్న మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా ఖతార్ పాలక కుటుంబం నుంచి జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. ట్రంప్ ఖతార్ వెళ్లినప్పుడు ఈ కానుక ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.