AP: ప్రజల భద్రతే లక్ష్యమని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు గాను పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో అనుమానితులను గుర్తించి విచారిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.