భారత గగనతంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధవిమానాలను నేలకూల్చామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రశిబిరాలు, పాక్ ఎయిర్ డిఫెన్స్‌పై దాడి చేసిన మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. కూల్చివేసిన పాక్ విమానాల వివరాలను ఇప్పుడు వెల్లడించలేమని తెలిపారు.