KRNL: రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ DIG డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రానాలు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్లలో పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.