NRPT: మరికల్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో గల శ్రీ ఈశ్వర, ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమ, మంగళవారాల్లో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం జల్దిబిందె, సాయంత్రం పల్లకి సేవ ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం రథోత్సవం, స్వామికి నిత్య పూజలను ఉంటాయన్నారు. రెండ్రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అన్నదాన వితరణ ఉందన్నారు.