భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ రాజస్థాన్ సరిహద్దు జిల్లాలను గురువారం రాత్రి బ్లాక్అవుట్ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో జోధ్‌పుర్‌లోని పావ్టాలో ఓ పెళ్లి జరుగుతోంది. అయితే, సప్తపది ప్రారంభమయ్యే సమయానికి లైట్లు ఆరిపోయాయి. దీంతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే వధువుతో వరుడు ఏడడుగులు నడిచాడు. తర్వాత మిగతా వివాహ ఆచారాలను కూడా అదే వెలుతురులో పూర్తి చేశారు.