ELR: హనుమాన్ శోభాయాత్ర భక్తి పూర్వక బైక్ ర్యాలీ పోస్టర్ను శనివారం కైకలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈనెల 22న సాయంత్రం 3:30 నిమిషాలకు కైకలూరు మార్కెట్ యార్డ్ నుంచి ఆటపాక ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు నిర్వహించే భక్తిపూర్వక ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.