MNCL: లక్ష్యసాధన కోసం బీసీ కులస్తులలో ఐక్యత అవసరమని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో నష్టపోతున్నామన్నారు. బీసీలలో చైతన్యం తీసుకువచ్చేందుకు బీసీ మేల్కొల్పు యాత్రను చేపట్టామన్నారు.