TPT: చిట్టమూరు మండల పరిధిలోని కొత్త గుంట సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా.. ఆటో మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్కు తరలించారు.