NRML: కుబీర్ మండల కేంద్రంలో గుక్కెడు నీటి కోసం బోర్ బావుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నామని మహిళలు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్న బోర్లు చెడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్లు రిపేర్ చేయించి నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు.