HYD: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి PS పరిధిలోని హబీబ్ నగర్లో జరిగింది. మహమ్మద్ చోటు 4 నెలలుగా వెన్ను నొప్పితో పాటు కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఈరోజు ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.