NLG: గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాంపల్లి మండలంలో జరిగింది. కేతేపల్లి గ్రామ శివారులో ఒకరు మామిళ్ల గిరి పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.