కామారెడ్డి జిల్లాలో జొన్న కొనుగోళ్ల కోసం 16కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా మార్క్ఫెడ్ అధికారి మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, ఆర్గొండ, కారేగావ్, గాంధారి, పిట్లం, పుల్కల్, తిమ్మానగర్, గుంకుల్, బోర్లం, పెద్ద కొడప్గల్, చిన్న కొడప్గల్, ముధోలి, ఎల్లారెడ్డి, పద్మాజివాడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.