TPT: జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మైనర్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అతని నుంచి రూ.8 లక్షల విలువైన 12 బైకులు, 8 సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.