NLG: నేడు దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్లు అందజేస్తారని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ తెలిపారు. అనంతరం గుండ్లపల్లి (డిండి), చందంపేట మండలాలలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.