KKD: పిఠాపురం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారంనాడు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలు సందర్భంగా గొల్లప్రోలు పట్టణంలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరై సిలువపై యేసు పలికిన ఏడు మాటలు ధ్యానించారు.