సాధారణంగా అత్తలపై కోడళ్లు గృహ హింస కేసులు పెట్టడం చూస్తుంటాం. అయితే ఇకపై అత్తలు కూడా కోడళ్లపై గృహ హింస కేసు పెట్టవచ్చు. ఈ మేరకు ఓ కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోడలు లేదా కుటుంబసభ్యులు ఎవరైనా అత్తని మానసికంగా, శారీరకంగా హింసిస్తే.. ఆమె డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం వారిపై కేసు పెట్టొచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.