TG: పోషకాహార రాష్ట్రం లక్ష్యంగా పని చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లకు గ్రేడింగులు ఇస్తామని మంచి గ్రేడ్లు సాధించిన సెంటర్లకు, సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కలకలలాడాలన్నారు.