కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.