• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పిల్లలకు బండి ఇస్తే ఇక అంతే..

TG: ట్రాఫిక్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే యజమానికి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే వాహన RCని కూడా 12 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. సదరు మైనర్‌కు 25 ఏళ్లు వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు.

April 5, 2025 / 08:11 AM IST

7 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

KDP: సింహాద్రిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్ బోధన ఉంటుందన్నారు.

April 5, 2025 / 08:10 AM IST

ఒక్క రోజులోనే ఐదుగురు మృతి

ప్రకాశం: వేర్వేరు కారణాలతో శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. పెద్ద దోర్నాల మండలంలోని గుంటవానిపల్లె సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో ఢీకొనటంతో రైతు మృతి చెందాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం, గిద్దలూరులో వేరువేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

April 5, 2025 / 08:04 AM IST

సీఎంను కలిసిన ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్

KRNL: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఉంటాయని TDP ఆలూరు ఇన్ ఛార్జ్ వీరభద్రగౌడ్ అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబును శుక్రవారం రాత్రి కలిసి నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగు, సాగు నీటికష్టాలను తీర్చాలని సీఎంను కోరారు.

April 5, 2025 / 08:00 AM IST

పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జియంఆర్

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి, సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, పేదరికం నిర్మూలనకు చదువు ఒక ఆయుధమని అన్నారు.

April 5, 2025 / 07:58 AM IST

నేటి నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు

కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. 5వ తేదీ శనివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు భధ్రాచలంకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయన్నారు. తిరిగి 6వ తేదీ స్వామి వారి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 1:00 గంట నుండి అందుబాటులో ఉంటాయన్నారు.

April 5, 2025 / 07:30 AM IST

10 మందికి రూ.5,85,000 చెక్కులు

BDK: మెరుగైన వైద్యం పొందలేని పేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం బూర్గంపాడు మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పది మందికి గాను రూ.5,85,000 విలువ గల చెక్కులను అందజేశారు.

April 5, 2025 / 07:11 AM IST

‘గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్’

KDP: పులివెందుల పట్టణంలోని చిన్న రంగాపురం గ్రామ సమీపంలోని కోతి సమాధి వద్ద శుక్రవారం గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నామని అర్బన్ సీఐ నరసింహులు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన పట్టుబడిన యువకుడు మల్లికార్జున మీడియా ఎదుట హాజరు పరిచారు. మల్లికార్జున జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాడన్నారు.

April 5, 2025 / 06:56 AM IST

గోపాలపురం AMC ఛైర్మన్ నియామకం

E.G: గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన యుద్దనపూడి బ్రహ్మరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారి చేసింది. బ్రహ్మరాజు మాట్లాడుతూ.. పార్టీలో తన కష్టం గుర్తించిన సీఎం చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

April 5, 2025 / 06:40 AM IST

‘రీఛార్జ్ స్టేషన్ను వినియోగించుకోవాలి’

VZM: VT అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జ్ స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.

April 5, 2025 / 06:39 AM IST

గుంటూరు కార్పొరేషన్‌లో రివ్యూ మీటింగ్‌

GNTR: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పశ్చిమ నియోజకవర్గంలో గల శానిటేషన్ సిబ్బందితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గాలలోని అన్ని డివిజన్‌లో ప్రజారోగ్య రక్షణలో పారిశుద్ధ్యం మెరుగుదలకు కార్మికులు, అధికారులు అంకిత భావంతో ఉండాలన్నారు.

April 5, 2025 / 05:27 AM IST

అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య 

PLD: అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి మండలం మిట్టమీద పల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (43) పది ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశాడు. మొత్తం సుమారు రూ.30లక్షలు అప్పు అవటంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనోవేదనకు గురై గ్రామ సమీపంలోని కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

April 5, 2025 / 05:24 AM IST

ఎమ్మెల్యేకు విద్యారంగ సంస్కరణలపై UTF వినతి

మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను శుక్రవారం UTF రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ రావు కలసి పాఠశాల విద్యారంగ సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులను ఇతర పాఠశాలల్లో విలీనం చేయవద్దని.. 6,7,8 తరగతులను ఎత్తివేయకూడదని కోరారు. ముఖ్యంగా తెలుగు-ఇంగ్లీష్‌ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు.

April 5, 2025 / 04:20 AM IST

BREAKING: ముంబైపై లక్నో విజయం

IPL 2025లో భాగంగా సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్య కుమార్‌ (67), నమన్‌ధీర్‌ (46), తిలక్‌ వర్మ(25) పరుగులు చేశారు.

April 4, 2025 / 11:25 PM IST

రామ్ చరణ్ ‘పెద్ది’.. రిలీజ్ డేట్ గ్లింప్స్ ఆరోజే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం అప్‌డేట్ పంచుకుంది. రిలీజ్ డేట్‌తో కూడిన గ్లింప్స్‌ను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉదయం 11:45 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నెట్టింట మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.

April 4, 2025 / 08:28 PM IST