KMM: రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులో పాడి గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా పాడి గేదేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
WGL: భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని “బ్యాండ్ మేళం” చిత్ర యూనిట్ సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు.
TG: జగిత్యాల మండలం మోతెలో విషాదం నెలకొంది. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందారు. దొడ్ల సంపత్ (25) అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. కొడుకు మృతితో ఏడుస్తూ అతడి తల్లి మల్లవ్వ (60) గుండెపోటుతో ప్రాణాలు వదిలింది.
JN: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంపీ కడియం కావ్య ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే రోజు అని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఎంపీ ఆకాంక్షించారు.
ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత, కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్‌తో కలిసి పీఎం శ్రీ పాఠశాలల అమలుపై ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో, ఇతర అధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పురోగతిని వివరించారు.
BHPL: మొగుళ్లపల్లి(M) ఇసిపేటలో బుధవారం ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ. సునిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వ పథకాల పై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిర మార్కెట్, అధిక దిగుబడి, దీర్ఘకాల ఆదాయం లభిస్తాయని, ఉద్యాన శాఖ సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్, మినీ కిట్‌లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. రంజాన్ పండుగ వేళ పేద ముస్లింలు అందరితో పాటు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం రంజాన్ కానుకలను పంపించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి రాజేష్, నాయకులు గంగారాం, నరేష్, రఫీ పాల్గొన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం పుచ్చాకాయలపల్లె గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డివిజినల్ అభివృద్ధి అధికారి బాలునాయక్ బుధవారం సందర్శించారు. ఇంటి పన్ను కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన, ప్రజలకు తాగునీరు అందిస్తున్న చలివేంద్రం ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ATP: డి.హీరేహల్ మండలం దొడగట్ట గ్రామంలో MLA కాలవ శ్రీనివాసులు ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడారు. పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, రైతుల పరిస్థితులపై స్వయంగా ఆరా తీశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే కల్పించడమే లక్ష్యమన్నారు.
AP: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో విషాదం నెలకొంది. వర్షానికి గోడ కూలి ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. ఈ క్రమంలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
VZM: గంజాయి తరలిస్తూ విశాఖ టాస్క్‌ఫోర్స్‌కు ఐదుగురు కానిస్టేబుళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. అందులో జిల్లాలోని కొత్తవలస పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇటీకర్లపల్లి సతీష్ ఉండడం స్థానిక పోలీసు స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం అతను విశాఖ సిటీ భీమిలి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
TPT: విద్యుత్ శాఖలో ఉగాది సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట డివిజన్ల పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సూళ్లూరుపేట సబ్ డివిజన్ ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. విజేతలను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
HNK: భీమ్ దీక్షను పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో జ్ఞాన ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జ్ఞానముగ్గుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో ఆవిష్కరించారు. ఈనెల 22వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.
KRNL: పెళ్లీడుకొచ్చిన కూతురు బలన్మరణం పొందడంతో ఆ కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన యువతి ప్రమీల ఉన్నత చదువులు చదివింది. తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందని భావించిన ఆశలు ఆవిరి అయ్యాయి. ప్రమీల (23) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.