TG: హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలున్నా..అప్పటి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాకుండా చేసిందని తెలిపారు.