KMM: బోనకల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మంగళవారం పొదిలి వెంకన్న బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని నూతన ఎస్సై చెప్పారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని నూతన ఎస్సై తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సైకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.