RR ‘సిక్సర్ల పిడుగు’ సూర్యవంశీపై మ్యాచ్ అనంతరం GT కెప్టెన్ గిల్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తప్పుబట్టాడు. ‘ఈరోజు సూర్యవంశీకి అదృష్ట రోజు. తనకు కలిసొచ్చిన రోజులో అద్భుత హిట్టింగ్ చేశాడు.’ అని గిల్ అన్నాడు. దీనికి జడేజా కౌంటర్ ఇస్తూ ’14 ఏళ్ల వయసులో అదృష్టంతో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేరు. దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది’ అంటూ గిల్ పేరు ప్రస్తావించకుండా చురకలంటించాడు.