JGL: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. రాయికల్ మండలంలోని పద్మశాలి కళ్యాణ ఫంక్షన్ హాల్ లో మంగళవారం భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు.