NLR: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు క్రీడా మైదానంలోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.