KRNL: గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 60 సంవత్సరాల వేడుకలకు మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు గ్రామం నుంచి రైతులు హాజరయ్యారు. పెద్దకడబూరుకు చెందిన బొగ్గుల నరసన్న, నల్లమల శాంతిరాజు, సామేలు లక్ష్మన్న, నాగరాజు ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వ్యవసాయంలో మెలకువలపై అవగాహన కల్పించారు.