TG: హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ పునరుజ్జీవం, ఉస్మానియా ఆస్పత్రి, కొత్త భవనాల నిర్మాణం, హైడ్రాపై చర్చలు జరపనున్నారు. కాగా.. భాగ్యనగరం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. పెట్టుబడుల ఆకర్షణకు నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని సంకల్పించుకుంది.