NGKL: బల్మూరు మండలం గోదల్లో 3గేదెలు ఒక గేదె దూడను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని బాధిత రైతు కొత్తపల్లి వెంకటరెడ్డి తెలిపారు. వ్యవసాయ పొలం వద్ద వాటిని కట్టివేసి ఉంచగా తాళ్లను కోసి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గేదెలను దొంగిలించుకు వెళ్లారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.