NLG: నల్గొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన బుచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమెకు అత్యవసరంగా A పాజిటివ్ రక్తం అవసరం పడింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహా లక్ష్మయ్య ద్వారా విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీస్ విజయకుమార్ వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు.