NDL: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం నేడు శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలించనుంది. డ్యామ్ గేట్ల దిగువన ఏర్పడిన భారీ గొయ్యి స్థాయిని అంచనా వేయనుంది. 2009 వరదల కారఎణంగా ఏర్పడిన ఈ గొయ్యి డ్యామ్ భద్రతకు ముప్పు కలిగిస్తోంది. తక్షణమే గొయ్యి పూడ్చివేత పనులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై బృందం సమీక్ష నిర్వహించనుంది.