KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవారం పులి పాదముద్రలు గుర్తించిన తరువాత, గ్రామంలో భయాందోళన నెలకొంది. కొండలో కుక్కను చంపి తిన్నట్లు కూడా వివరించారు. ఫారెస్టు అధికారులు పాదముద్రలను పరిశీలించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.