KRNL: భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని శనివారం కర్నూలులోని 5 రోడ్ల కూడలి, RS రోడ్డు వద్ద JC డాక్టర్ B.నవ్య, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. కార్యక్రమంలో కోడుమూరు, పాణ్యం MLAలు పాల్గొన్నారు.