SKLM: లావేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 90 రోజులు వీరికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.