HYD: శేరిలింగంపల్లి సర్కిల్లో డిప్యూటీ కమిషనర్ వి.ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణిలో స్థానికులు12 వినతి పత్రాలు అందజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 6, ఇంజినీరింగ్‌కు 2, శానిటేషను 3, రెవెన్యూ విభాగానికి ఒక దరఖాస్తు వచ్చినట్లు సర్కిల్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీలు ప్రేమ్ కుమార్, ఏసీపీ వెంకటరమణ, ప్రాజెక్టు ఆఫీసర్ మల్లీశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.