ADB: చత్తీస్గడ్లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.