• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థలకు అభినందనలు

మేడ్చల్: “ట్రెయిన్ యువర్ సెల్ఫ్” మార్షియల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ నవీన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికా డర్బన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటేలో 30 కేజీలో బిళరి సిల్వర్, 35 కేజీలో భార్గవ్, 45 కేజీలో సాయి సహస్రద్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అభినందించారు.

February 9, 2025 / 05:20 PM IST

ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను చూడాలి:మంత్రి

కోనసీమ: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సూక్ష్మ,చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మండపేట మండలం మారేడుబాకలో మహిఎంటర్ ప్రైజెస్, ఆద్విక డెకర్స్ పరిశ్రమను ఆదివారం MLA వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

February 9, 2025 / 05:20 PM IST

సైన్స్ ఫెయిర్‌లో కంటోన్మెంట్ MLA

HYD: విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత కూడా చాలా అవసరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. ఆదివారం న్యూ బోయిన్‌పల్లిలోని సీతారాంపురంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మంజులా వాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 9, 2025 / 05:19 PM IST

మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

RR: మైలార్దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాటేదాన్ పారిశ్రమికవాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 9, 2025 / 05:18 PM IST

గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గుంటూరు: కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029తో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికలపై ఫిర్యాదు చేయడంతో పాటు ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 9, 2025 / 05:17 PM IST

IND vs ENG: భారత్ టార్గెట్ ఎంతంటే..?

కటక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్(65), జో రూట్(69), బట్లర్ (34), బ్రూక్(31), లివింగ్‌స్టోన్(41) సమిష్టిగా రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా.. షమీ, రాణా, పాండ్యా, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. భారత్ టార్గెట్ 305.

February 9, 2025 / 05:16 PM IST

నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు వితరణ

KMM: మధిర పట్టణంలోని ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు దాతల ఆర్థిక సహకారంతో మధిర పట్టణంలో గల నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణ గా అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ నిర్వాహకురాలు హరిణి మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో స్పందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 9, 2025 / 05:16 PM IST

సాగు నీరందక బీటలు వారుతున్న పొలాలు

కోనసీమ: వరుస విపత్తులతో విలవిల్లాడుతున్న రైతన్నకు పాలకులు దన్నుగా నిలవడం లేదు. అయినవిల్లి మండలంలో సుమారు ఎనిమిది వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తున్నారు. సాగు నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

February 9, 2025 / 05:15 PM IST

గీత కులాల మద్యం షాపుల ఎంపిక వాయిదా: ఎక్సైజ్ సీఐ

కోనసీమ: ఈనెల 10న జరగాల్సిన గీత కులాల మద్యం షాపుల ఎంపిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా పడిందని ఎక్సైజ్ సీఐ ఐ.డి. నాగేశ్వరావు అన్నారు. ఆలమూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారులు గమనించి, తదుపరి తేదీ ప్రకటించే వరకు వేచి ఉండాలని ఆయన కోరారు.

February 9, 2025 / 05:12 PM IST

క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

TPT: చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో జరుగుతున్న చిల్లకూరు మండలం సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మండల క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు రూ. 50,000 విరాళాన్ని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ… గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ప్రధానంగా క్రికెట్‌పై  ఆసక్తి కనబరచాలన్నారు.

February 9, 2025 / 05:11 PM IST

వెదురుకుప్పంలో జోరుగా పశువుల పండగ

CTR: వెదురుకుప్పం మండలంలోని పాత గుంటలో పశువుల పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. జల్లికట్టులో యువత పశువులను పట్టుకునేందుకు పోటీపడ్డారు. దీనిని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

February 9, 2025 / 05:10 PM IST

నల్లగొండలో బీజేపీ అసమ్మతివాదులు నిరసన

NLG: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తుండగా జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక పట్ల బీజేపీ సీనియర్ నేతలు అసమ్మతివాదులు ఆదివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నేతలు జిల్లా అధ్యక్ష ఎన్నికపై పునారాలోచన చేయాలన్నారు.

February 9, 2025 / 05:05 PM IST

ఆరోగ్యకే ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు.

February 9, 2025 / 05:05 PM IST

రేపు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

E.G: నల్లజర్ల మండలంలోని పలు గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మత్తుల కారణంగా మండల పరిధిలోని దుబచర్ల, ఘంటావారి గూడెం గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 9, 2025 / 05:03 PM IST

వేసవి ఉచిత శిక్షణా తరగతులు

VZM: తూర్పు భాగవతంపై వేసవి ఉచిత శిక్షణా తరగతులు మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తూర్పు భాగవతం కళాకారుడు బి.శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు శిక్షణా తరగతులకు హాజరు కావాలని కోరారు. కళాకారులను ప్రోత్సహించేందుకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 9, 2025 / 04:51 PM IST