• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు

E.G: జిల్లాలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు RIO NSVL నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. తొలి విడతాగా 58 కేంద్రాల్లో ఇవాల్టి నుంచి ఈనెల 14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

February 10, 2025 / 06:39 AM IST

విశాఖలో పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష

VSP: జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

February 10, 2025 / 06:17 AM IST

‘సముద్రతీరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి’

AKP: రాంబిల్లి మండలం లోవపాలెం సముద్ర తీరా ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎరిపిల్లి అజయ్, మాజీ సర్పంచ్ చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్‌ను ఆదివారం కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రతీరంలో పరశురాముడు ఆలయం ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు.

February 10, 2025 / 06:15 AM IST

‘పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, కేజ్రీవాల్ నిరాకరించారు’

ఢిల్లీలో AAPతో ఎన్నికలకు ముందు పొత్తుకు CONG సిద్ధంగా ఉందని జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా పేర్కొన్నారు. కానీ ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అందుకు నిరాకరించారని తెలిపారు. ‘ఇది కేజ్రీవాల్ ఓటమి, CONG లేకుండా అద్భుతాలు చేయగలడనే ఆయన అహంకారం మాత్రమే’ అని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలుచుకోగా, CONG ఒక్క సీటు కూడా గెలవలేదు.

February 10, 2025 / 05:21 AM IST

వాలీబాల్‌లో విశాఖ యువకుల సత్తా

VSP: ఉత్తరాఖండ్ జాతీయ బీచ్ వాలీబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించి సాయి, బాబీ ఆదివారం విశాఖ చేరుకున్నారు. వారిని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడ పోటీలలో బంగారు పతకం సాధించి విశాఖకు మంచి పేరు తెచ్చుకున్నారని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు.

February 9, 2025 / 08:22 PM IST

కొండపి ఏవో ముఖ్యమైన సూచనలు

ప్రకాశం: కొండపి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఏవో డి.విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ తీసుకెళ్లి 14 అంకెల ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్య కార్డు పొందాలన్నారు.

February 9, 2025 / 08:21 PM IST

మొగల్తూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

W.G: మొగల్తూరు మండలంలోని కుక్కలవారితోట గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అలాగే కూటమి అభ్యర్దిని గెలిపించాలని కోరారు.

February 9, 2025 / 08:16 PM IST

సెంచరీతో విధ్వంసం చేసిన హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ(51), సచిన్(49) ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

February 9, 2025 / 08:16 PM IST

విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి కృషి

SKLM: ఆమదాలవలస పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు ధనుంజయరావును సన్మానించారు. విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన ఈయనను కమిటీ సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల ఈ సన్మాన కార్యక్రమాన్ని జరిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

February 9, 2025 / 08:16 PM IST

‘కొడిమెల హిమతేజను సన్మానించిన సంఘం నాయకులు’

ADB: ఉమ్మడి జిల్లా నుండి రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఎంపికైన కొడిమెల హిమతేజను మున్నూరుకాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి దేశవాళి క్రికెట్‌లో సైతం రాణించాలని ఆకాంక్షించారు. శివన్న, సుభద్రబాయి, శంకర్, రవికాంత్, మధు, ఆడేళ్లు తదితరులున్నారు.

February 9, 2025 / 08:02 PM IST

మజ్జి గౌరీ యాత్రను పర్యవేక్షించిన SHO

VZM: రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో జరుగుతున్న మజ్జి గౌరీ యాత్రను ఆదివారం రాజాం SHO అశోక్ కుమార్ పర్యవేక్షించారు. యాత్రలో ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర, అమ్మవారి గుడి వద్ద భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మూర్తి, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

February 9, 2025 / 07:54 PM IST

లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించిన సింగర్ మౌనిక

MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని ఆదివారం ఫోక్ సింగర్ మామిడి మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మామిడి మౌనిక మాట్లాడుతూ అమ్మవారి చరిత్రను పూర్తిగా తెలుసుకొని త్వరలోనే ఒక పాటను రూపొందిస్తానని ఆలయ సిబ్బందికి తెలిపారు.

February 9, 2025 / 07:40 PM IST

‘సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా’

KKD: ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వీర రాఘవులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిత్యం ప్రజలు, గ్రాడ్యుయేట్లు, బాధితుల పక్షాన అండగా నిలబడి పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

February 9, 2025 / 07:11 PM IST

విగ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 3,18,218 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 795 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 4,190 మంది భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.

February 9, 2025 / 07:00 PM IST

‘దేశంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోతోంది’

TG: ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను పక్కనపెట్టారని MP రఘునందన్‌రావు అన్నారు. దేశంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోతోందని.. ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డే మిగిలిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 8 వేల మంది పదవి విరమణ చేస్తే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని ఆరోపించారు. డీఏ ప్రకటనలకే పరిమితమైందన్నారు. MLC ఎన్నికల్లో BJP విజయం ఖాయమన్నారు.

February 9, 2025 / 05:23 PM IST