ADB: నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.