• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రభుత్వాసుపత్రిలో డైట్ సిబ్బందికి టీకాలు’

ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యమని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి పేర్కొన్నారు. డైట్ విభాగంలో పనిచేసే ఫుడ్ హ్యాండ్లర్స్‌కు టైఫాయిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యం, పేషెంట్ల భద్రత తమకు ముఖ్యమని తెలిపారు.

March 18, 2026 / 06:00 PM IST

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP

ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న హోంగార్డు లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ లక్ష్మీ ఇంటికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ సహాయం కింద కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

March 18, 2026 / 06:00 PM IST

కొల్లాపూర్ పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

NGKL: కొల్లాపూర్ కొనసాగుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 100% పన్ను వసూలు చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు.

March 18, 2026 / 06:00 PM IST

జిల్లాలో పతనం అవుతున్న కొబ్బరి ధర

కోనసీమ: జిల్లాలో కొబ్బరి ధర రోజురోజుకు పతనం అవుతుంది. గత నెలలో రూ.22 నుంచి రూ.24 పలికిన ధర ప్రస్తుతం రూ.14 నుంచి రూ.16 కి పడిపోయింది. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం పరిస్థితుల నేపధ్యంలో ఎగుమతులు నిలిచిపోవడమే కొబ్బరి ధర పతనానికి కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 06:00 PM IST

డివిజన్‌లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

MBNR: కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ క్రిస్టియన్ పల్లి ఆదర్శనగర్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పారిశుద్ధ్యం రోడ్లు వీధి బల్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకూడదని సిబ్బందిని ఆదేశించారు.

March 18, 2026 / 06:00 PM IST

కదిరి వైసీపీ కార్యకర్తకు సజ్జల భరోసా

సత్యసాయి: కదిరి నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మెగా అంజాద్‌పై నమోదైన అక్రమ కేసుల అంశాన్ని నియోజకవర్గ సమన్వయకర్త BS మక్బూల్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లిలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తాజా పరిస్థితులను వివరించారు. అంజాద్ కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

March 18, 2026 / 06:00 PM IST

‘ఫోటో క్యాప్చర్ విధానం రద్దు చేయాలి’

MDK: ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడవయ్య డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ఫోటో క్యాప్చర్ విధానం తీసుకువచ్చిందని ఆరోపించారు.

March 18, 2026 / 06:00 PM IST

‘అలా అయితే ఏడాదికి 10 సినిమాలు తీస్తా’

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చాలా తక్కువ రోజుల్లో దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిచేశాడని మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని తెలిపాడు. హరీష్‌లా సినిమా తీస్తే తాను ఏడాదికి 10 సినిమాలు తీయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఉస్తాద్ సినిమా షూటింగ్‌ను నిర్మాతగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేశానని.. ఒక పిక్నిక్ తరహాలో గడిచిపోయిందని పేర్కొన్నాడు.

March 18, 2026 / 05:56 PM IST

రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

MDCL: పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తాందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది.

March 18, 2026 / 05:55 PM IST

పాఠశాలల్లో డిజిటల్ సదుపాయాలు పెంచాలి: ఎంపీ

NDL: నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి లోక్‌సభలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సదుపాయాల పెంపుపై విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్య కోసం వైఫై, ఇంటర్నెట్ అవసరమని ఆమె తెలిపారు. ప్రస్తుతం తక్కువ పాఠశాలలకే ఈ సదుపాయం ఉందని పేర్కొంటూ.. మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కేంద్రాన్ని బుధవారం కోరారు.

March 18, 2026 / 05:55 PM IST

‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న MAO

GNTR: ఫిరంగిపురం మండలంలోని ఫిరంగిపురం, రేపూడి గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బిందు, తుంపర సేద్యానికి 90 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో గ్రామస్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 05:54 PM IST

‘విశాఖలో భూ ఆక్రమణలు పెరుగుతున్నాయి’

విశాఖలో భూ ఆక్రమణలు పెరుగుతున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని, నగరాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.

March 18, 2026 / 05:53 PM IST

రాజకీయాలు కంటే వివాదాలే ఎక్కువ..!

HYD: తాండూరు మాజీ MLA రోహిత్ రెడ్డి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2018 నుంచి డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల ఎర కేసు, పోలీసులతో గొడవలు వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసులతో గొడవ పడి, వారంపాటు అజ్ఞాతంలో ఉండి బెయిల్ పొందారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్‌లో హాజరవుతున్నారు.

March 18, 2026 / 05:50 PM IST

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

SRPT: జిల్లా ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టాలన్నారు.

March 18, 2026 / 05:49 PM IST

దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన కలెక్టర్

NTR: విజయవాడలో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. కలెక్టర్ మాట్లాడుతూ… 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 05:49 PM IST