SKLM: జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి అందే వినతులపై అధికారులు అత్యంత వేగంగా స్పందించి, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ దినేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.
JN: చిల్పూరు ఎంపీడీవో రఘురామకృష్ణను బీజేపీ మండల అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చూడాలని, వీబీ రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం కల్పించాలని ఉపేందర్ యాదవ్ కోరారు.
పిల్లలు మొబైల్ చూడటాన్ని తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. ఎలా అంటే.. తాత్కాలికంగా పిల్లల నుంచి విరామం పొందడానికి, అన్నం తినిపించడానికి మొబైల్‌ను వారికి ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు తెలియకుండానే స్క్రీనింగ్‌కు అలవాటు పడతారు. అలా కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయండి. కథలు చెప్తూ అన్నం తినిపించండి. అంతేకానీ వారిని ఫోన్లకు అలవాటు చేయకండి. SHARE IT
HNK: గిరిజనులకు హామీల అమలుకై బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్ననాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. హనుమకొండలో వారు మాట్లాడుతూ… గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపై బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమన్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ బేల్దారు నవీన్ లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌తో పాటు జీపీవో సుధాకర్, పంచాయతీ సెక్రెటరీ రమేష్, వార్డు మెంబర్ గోవర్ధన్ పాల్గొన్నారు.
KMM: ఖమ్మం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.196 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ అనుదీప్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి పౌర సేవలను మెరుగుపరచాలని నిర్ణయించారు.
SRPT: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాల రాయితీ పథకాలను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. 60 నుంచి 90 శాతం రాయితీ ఉండే ఈ పథకాలకు ఈనెల 24 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అర్హులు తమ పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలని పేర్కొన్నారు.
VZM: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆన్‌లైన్ ద్వారా తమ ఛాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
MDK: చిలిపిచేడు మండలం అజ్జమరి గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు చెందిన శ్రీనిధి రుణాల మొండి బకాయిల వసూళ్లను బుధవారం అధికారులు ప్రారంభించారు. ఏపీఎం గౌరీశంకర్, పురుషోత్తం, బ్యాంక్ మేనేజర్, సీసీలు, ఫీల్డ్ ఆఫీసర్లు గ్రామంలో మహిళలను కలిసి బకాయిలు చెల్లించాలని కోరారు. సమయానికి రుణాలు చెల్లించి గ్రూపుల బలోపేతానికి సహకరించాలని సూచించారు.
VSP: డీప్ సీ ఫిషింగ్‌కు వెళ్లిన మెఖనైజ్డ్ బోటు ఇంజన్ దెబ్బతిని సముద్రంలో చిక్కుకుపోయింది. ట్రాన్స్‌పాండర్ సాయంతో స్థానాన్ని గుర్తించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని రక్షించింది. శ్రీలంకకు చెందిన నలుగురు, విశాఖకు చెందిన ఇద్దరు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఈ సదుపాయం ప్రాణరక్షణలో కీలకమని యజమాని తెలిపారు.
KNR: మీర్జంపేటకు చెందిన కేశవేణి సాగర్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 23 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ ఎంపీటీసీ సదానందం గౌడ్ బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆపదలో అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ పేదలకు కొండంత ఆసరా అని పేర్కొన్నారు.
MBNR: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తాగునీరు పారిశుద్ధ్యం డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.
NGKL: ఉగాది పండగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు స్పెషల్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఛార్జీలు విపరీతంగా పెంచారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రూ.140 ఉన్న ఛార్జిని రూ.200 వరకు పెంచారు. దీంతో మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చి పురుషులకు ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
HYD: మూసీ నదిని మురికికూపంగా మార్చిన చరిత్ర కాంగ్రెసేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. తాము మూసీ అభివృద్ధికి ఎన్నడూ వ్యతిరేకం కాదని కేవలం రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవాలనే కుట్రను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ భారీ కుంభకోణానికి తెరలేపడం సరికాదని ఈదోపిడీపై తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.